ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముస్లిం ఆడపిల్లలు చదువులో వెనకబడకూడదనే.. ఆ నిబంధన: సీఎం జగన్​

By

Published : Nov 11, 2022, 2:52 PM IST

CM JAGAN IN ABUL KALAM AZAD BIRTH ANNIVERSARY రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సీఎం జగన్​ అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనని పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

CM JAGAN IN ABUL KALAM AZAD BIRTH ANNIVERSARY
CM JAGAN IN ABUL KALAM AZAD BIRTH ANNIVERSARY

CM JAGAN IN ABUL KALAM AZAD BIRTH ANNIVERSARY : మైనార్టీల సంక్షేమంలో తన తండ్రి కంటే 2 అడుగులు ముందుకేస్తానని సీఎం జగన్‌ అన్నారు. గుంటూరులో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమంలో 2019 తర్వాత మార్పులు వచ్చాయన్న సీఎం జగన్.. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వలేదని.. తమ ప్రభుత్వంలో మైనార్టీ వ్యక్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని చెప్పారు. .

ముస్లిం ఆడపిల్లలు చదువులో వెనకబడకూడదనే ఉద్దేశంతోనే మైనార్టీ తోఫాకు పదో తరగతి ఉత్తీర్ణులు కావాలని నిబంధనను పెట్టినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సీఎం జగన్​ అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనని పేర్కొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో సీఎం జగన్​

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించడం సంతోషం. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే. మైనార్టీల సంక్షేమంలో నా తండ్రి కంటే 2 అడుగులు ముందుకేస్తా. మైనార్టీల సంక్షేమంలో 2019 తర్వాత మార్పులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో మైనార్టీ వ్యక్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వైకాపాలో నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు మైనార్టీలే ఉన్నారు. -సీఎం జగన్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details