ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గర్భిణికి పురిటి నొప్పులతో ఆగిన రైలు

By

Published : Nov 13, 2020, 10:27 AM IST

నిండు గర్భిణి.. రైలులో ప్రయాణం చేస్తోంది. ఒక్క సారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు రైల్వే టోల్​ఫ్రీ నెంబర్​కు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు, సిబ్బంది రైలుని నిలిపివేసి గర్భిణిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసుకుంది.

lady delivery
lady delivery

తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే పోలీసుల సమయస్ఫూర్తితో.. నిండు గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై ఆసుపత్రిలో చేర్చారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. బంధన్ రాయ్, జైధన్ రాయ్ దంపతులు అస్సోం నుంచి బెంగుళూరుకు గౌహతి ఎక్స్ ప్రెస్​లో వెళ్తున్నారు. సామర్లకోట దాటిన తర్వాత బంధన్ రాయ్​కి పురిటి నొప్పులు రావడంతో.. రైల్వే టోల్​ఫ్రీ నెంబర్​కు సమాచారం అందించారు. దీంతో తునిలో రైలుని నిలిపివేశారు. ఎస్సై అబ్దుల్ మరూఫ్, సిబ్బంది ఆమెను 108 వాహనంలో తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. సుఖ ప్రసవమై తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో ఆ దంపతులు రైల్వే పోలీసులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details