వైద్యుడు దైవంతో సమానం అనేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలే నిదర్శనం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతనంగా మంజూరైన అంబులెన్స్‌కు డ్రైవర్‌ను నియమించకపోవటంతో.. అక్కడి వైద్యుడు ఆనంద్ సత్యతేజ్ డ్రైవర్‌గా మారాడు. అక్కడి క్వారంటైన్ కేంద్రంలో ఉంచిన కొందరిని ఆయనే స్వయంగా అంబులెన్స్ నడుపుతూ మరో క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
వైద్యుడే డ్రైవర్‌గా మారిన వేళ.. - డ్రైవరుగా మారిన వైద్యుడు
వైద్యుడు డ్రైవరుగా మారి అనుమానితుల్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పరిధిలో జరిగింది. గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు ఆనంద్ స్వయంగా అంబులెన్స్ డ్రైవర్‌గా మారి ప్రశంసలందుకుంటున్నాడు.
వైద్యుడే డ్రైవర్‌గా మారిన వేళ..
TAGGED:
డ్రైవరుగా మారిన వైద్యుడు