ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తులసివనం లాంటి జిల్లాను గంజాయి వనంలా మార్చేశారు'

By

Published : Feb 3, 2021, 5:05 PM IST

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారని తెదేపా మహిళా నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. తులసివనం లాంటి జిల్లాను గంజాయి వనంలా మార్చేశారని ఆక్షేపించారు.

తులసివనం లాంటి జిల్లాను గంజాయి వనంలా మార్చేశారు
తులసివనం లాంటి జిల్లాను గంజాయి వనంలా మార్చేశారు

తులసివనం లాంటి చిత్తూరు జిల్లాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గంజాయి వనంలా మార్చేశారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనే సత్తా..పెద్దిరెడ్డికి లేదని ఆక్షేపించారు. చిత్తూరు జిల్లాలో ఆయనో నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. తన పేరును పెద్దిరెడ్డి రావణరెడ్డి అని మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.

మంత్రి దౌర్జన్యాలకు భయపడి నామినేషన్ వేసేందుకు మహిళా అభ్యర్థులు భయపడుతున్నారన్నారు. పుంగనూరు తెదేపా ఇంఛార్జ్ అనీషా రెడ్డిపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హేయమన్నారు. జిల్లాకు పెద్దిరెడ్డి కుటుంబం రాక్షస మూకలా తయారైందని పంచుమర్తి అనురాధ ఆక్షేపించారు.

ఇదీచదవండి: 'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'

ABOUT THE AUTHOR

...view details