Karthikeya Bhaje Vaayu Vegam Heroine Iswarya Menon At Shirdi : "భజే వాయు వేగం" చిత్రం విజయం తర్వాత, ప్రసిద్ధ దక్షిణాది నటి ఐశ్వర్య మీనన్ శిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. మే 31న ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైన తెలుగు చిత్రం "భజే వాయు వేగం" ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది, సూపర్ హిట్ చిత్రంగా మారింది. ఈ నేపథ్యంలో తల్లి జయ మీనన్‌తో కలిసి బాబా దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం తాను రెండు తెలుగు, ఒక మలయాళ చిత్రాల నటిస్తున్నానని ఐశ్వర్య మీనన్ తెలిపారు.సౌత్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొత్త చిత్రం "బాజుకా" షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రేక్షకుల కోసం బజూకాను త్వరలో విడుదల చేస్తామని నటి ఐశ్వర్య మీనన్ చెప్పారు.
నటి ఈశ్వర్య మీనన్ తన తల్లి జయ మీనన్ సాయిబాబా సమాధి దర్శనం తరువాత, ద్వారకామాయి, గురుస్థాన్ ఆలయ దర్శనం చేసుకున్నారు. అనంతరం సాయిబాబా సంస్థాన్ సీఈఓ (CEO) గోరక్ష్ గాడిల్కర్ నటి ఈశ్వర్య మీనన్, తల్లి జయ మీనన్‌లను శాలువాతో సత్కరించారు.
'డంకీ సూపర్ హిట్ అయ్యేలా చూడు సాయి!'- షిర్డీ బాబాకు షారుక్ స్పెషల్ పూజలు
నా కొత్త సినిమాలేవీ విడుదల కాకముందే శిర్డీకి సాయిబాబా దర్శనం కోసం తప్పకుండా శిర్డీ వస్తున్నానని, గత పదేళ్లుగా సాయిబాబా దర్శనం కోసం శిర్డీకి తప్పకుండా వస్తున్నానని నటి ఐశ్వర్య మీనన్ తెలిపారు.
కార్తికేయ (Kartikeya) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje Vayu Vegam). ఈ చిత్రంతో ప్రశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. జూన్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కార్తికేయ సరసన ఐశ్వర్య మేనన్ నటించిన ఈ చిత్రంలో రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, శరత్ లోహితస్వ తదితరులు నటించారు.
దూసుకెళ్తున్న 'భజే వాయు వేగం' కలెక్షన్స్ - ఆ ఒక్కటే కారణం! - Bhaje Vaayu Vegam Movie