AP DSC Notification 2024 for 16347 Vacancies : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. జగన్ సర్కారు తప్పిదాల కారణంగా రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఈ మేరకు కేబినెట్లోనూ ప్రభుత్వం తీర్మానం చేసింది. మొత్తం 16,347 పోస్టుల భర్తీకి కానూ ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు.
మరోసారి టెట్ : ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియలో భాగంగా మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నెల 30వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. అయితే జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా డీఎస్సీ 2024 పోస్టుల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గడచిన మూడేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం టెట్ (AP TET 2024 Exam) నిర్వహించకపోవటంతో ఈ దుస్థితి తలెత్తింది. టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో నిరుద్యోగులకు పండగ- మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు తొలి సంతకం - Mega DSC Posts
16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ : ఇక టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి మరో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన రెండు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ తీర్మానం చేశారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 16,347 పోస్టులను ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా భర్తీ చేయనున్నారు.
పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.