ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆ ఎస్​ఐపై చర్యలు తీసుకోవాలి.. లేకుంటే..'

By

Published : Jul 7, 2022, 7:44 PM IST

బాపట్ల జిల్లాలో మైనార్టీ యువకుడిని స్టేషన్​కు పిలిపించి.. దాడి చేసిన ఎస్​ఐపై చర్యలు తీసుకోవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుక్ షిబ్లీ డిమాండ్ చేశారు. లేకుంటే తమ సంఘం తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు.

ఫారుక్ షిబ్లీ
ఫారుక్ షిబ్లీ

బాపట్ల జిల్లా వేమూరు పోలీస్ స్టేషన్​లో ఎస్ఐ అనిల్ కుమార్.. మైనార్టీ యువకుడిని స్టేషన్​కు పిలిపించి దాడి చేసిన ఘటనపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్పందించింది. ఎస్ఐ దాడిలో గాయపడి.. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ రఫీని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఫారుక్ షిబ్లీ పరామర్శించారు.

ఒకవేళ రఫీ తప్పు చేసి ఉంటే రాజ్యాంగపరంగా శిక్షించాలే తప్ప.. రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షించే అర్హత ఎస్ఐకి లేదని ఫారుక్ షిబ్లీ అన్నారు. ఘటనకు కారణమైన ఎస్ఐ అనిల్ కుమార్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై దర్యాప్తు జరిపించి.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ తప్పు చేసినట్లు రుజువైతే అతనిపై కేసు నమోదు చేయాలన్నారు. లేకుంటే తమ సంఘం తరఫున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ జరిగింది: బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై అనిల్ ఓ యువకుడిపై దాష్టీకం ప్రదర్శించాడు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడిని స్టేషన్​కు పిలిపించి విచక్షణారహితంగా చితకబాదాడు. తలపై కత్తితో దాడి చేయటంతో సదరు యువకుడికి తీవ్రగాయమైంది. కుమారుడి గాయం చూసి స్టేషన్​లోనే అతని తల్లి సృహతప్పి పడిపోయింది. ఆమె తలకు గాయం కావటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: యువకుడిపై ఎస్​ఐ దాష్టీకం..తలపై జుట్టును కోసేసి..

ABOUT THE AUTHOR

...view details