ETV Bharat / state

ఐదేళ్లపాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu naidu Chit Chat - CM CHANDRABABU NAIDU CHIT CHAT

CM Chandrababu Naidu Chit Chat: ఐదేళ్లపాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేళ్ల జగన్‌ పాలనతో సరిదిద్దలేనంత నష్టం జరిగిందన్న సీఎం, దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని తెలిపారు. నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని, గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులూ ఆశించలేదని అన్నారు.

CM Chandrababu Naidu Chit Chat
CM Chandrababu Naidu Chit Chat (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 5:01 PM IST

Updated : Jul 5, 2024, 9:48 PM IST

CM Chandrababu Naidu Chit Chat: ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుధ్ఘాటించారు. గత ఐదేళ్ల దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేని స్థాయిలో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తామని స్పష్టంచేశారు.

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని చెప్పారు. గోదావరి నుంచే 3వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని, ఆ నీటిని వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.

కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు ఆశించలేదని గుర్తుచేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సత్సంబంధాల కోసమే స్పీకర్ పదవికి మాత్రం అప్పట్లో అంగీకరించానని చెప్పారు. ఇప్పుడూ ఎలాంటి పదవులు కోరలేదని, కానీ ఎన్డీఏ నుంచి వచ్చిన ఆఫర్‌ని కాదనకుండా, రెండు మంత్రి పదవులు తీసుకున్నట్లు వివరించారు.

"దటీజ్​ చంద్రబాబు" హాట్​టాపిక్​గా దిల్లీ తొలి పర్యటన​- నాడు జగన్​ 29సార్లు - CBN Delhi Tour

గత ఐదేళ్ల జగన్ పాలనతో అమరావతిపైన ఉన్న ఆకర్షణ కొంత తగ్గిందన్నారు. అమరావతికి కోల్పోయిన ప్రతిష్టను తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. 135 ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని, అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్‌ సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని, వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నటువంటి భవనాలను తొలుత పూర్తి చేస్తామని వివరించారు.

రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్యగణన చేపట్టాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించామని, త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. మానవ వనరులను మూలధన పెట్టుబడిగా మార్చి, సంపద సృష్టించబడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో నైపుణ్యాలు క్రోడీకరించి వాళ్ల శక్తి సామర్థ్యాలే పెట్టుబడిగా, సంపద సృష్టిస్తామన్నారు. దీనివల్ల ఎక్కడికో వెళ్లి ఒకరి కింద పని చేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రతి కుటుంబం ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారుతారని, తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందని వివరించారు.

దిల్లీలో మారిన లెక్క - రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపైనే వరుస భేటీలు - CBN Delhi Tour

సమస్యల పరిష్కారం కోసం రేవంత్‌రెడ్డితో చర్చిస్తా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగే సమావేశంపైనా చంద్రబాబు స్పందించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలన్నదే తన విధానమని చెప్పారు. రేవంత్‌ రెడ్డితో సమావేశంలోనూ ఇరురాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కారం కోసం చర్చిస్తామన్నారు.

మళ్లీ జగన్ వస్తే ఎలా అని అన్ని వర్గాలు అడుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. డెవిల్‌ని నియంత్రించామని ఇకపై ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గత ఐదేళ్లుగా జరిగిన నష్టం నుంచి బయటకు రావాలని, అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకారం కావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. దావోస్‌లో పెట్టుబడుల సదస్సుకు తప్పక హాజరవుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

రేపే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ - ఈ అంశాలపైనే చర్చ! - TG CM REVANTH AND AP CM CBN MEETING

Last Updated : Jul 5, 2024, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.