ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం కోసం మండటెండనూ లెక్కచేయక....

By

Published : May 4, 2020, 4:01 PM IST

దుకాణాలు తెరుచుకున్నది 11 గంటలకు.. అయినా తెల్లవారుజామునే వచ్చి నిలబడ్డారు. సర్వర్ అప్​డేట్ కారణంగా మరో గంట అమ్మకాలు లేటయ్యాయి. అయినా ఎండలో నిలబడి నిరీక్షించారు. దాదాపు నెలన్నర తర్వాత దొరకబోతున్న మద్యం కోసం మందుబాబులు దేన్నీ లెక్కచేయక ఎదురుచూశారు. చివరికి బాటిల్ తీసుకుని సంతోషంగా ఇళ్లకు వెళ్లారు.

liquor sales at madakasira in ananthapuram district
మద్యం కోసం మండటెండనూ లెక్కచేయక....

అనంతపురం జిల్లా మడకశిరలో మద్యం దుకాణాల ముందు మందుబాబులు క్యూ కట్టారు. సర్వర్ అప్​డేట్ కారణంగా మధ్యాహ్నం 12 గంటలవరకూ అమ్మకాలు జరగలేదు. అయినా ఉదయం నుంచే జనం బారులు తీరారు. మండుటెండలో నించుని మద్యం కోసం నిరీక్షించారు. పోలీసులు అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details