ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"వైకాపా పెద్దల అవినీతి... ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది"

By

Published : May 7, 2022, 1:46 PM IST

MLC Ashok Babu: వైకాపా నేతల అవినీతి.. ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

MLC Ashok Babu
ఎమ్మెల్సీ అశోక్​బాబు

ఎమ్మెల్సీ అశోక్​బాబు

MLC Ashok Babu: రాష్ట్రంలో వైకాపా పెద్దల అవినీతి.. ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకటో తేదీన కూడా వేతనాలు ఇప్పించలేని ఉద్యోగ సంఘాల నాయకులతో లాభమేముందని ప్రశ్నించారు. ఏడో తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రంలో జీతాలు అందలేదన్నారు. ఎవరైనా అప్పిస్తే తప్ప జీతాలు అందని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనటానికి కారణం ఆర్థిక పరిస్థితి దివాళా తీయటమేనని ధ్వజమెత్తారు. ఆదాయం పెరుగుతున్నా.. ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తోందని నిలదీశారు.

MLC Ashok Babu: ఏప్రిల్ నెలలో ఇచ్చే మార్చినెల వేతనాలు కూడా అందరికీ సక్రమంగా చెల్లించలేదని దుయ్యబట్టారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలో ఇబ్బందులున్నాయనే వంకతో కోట్లాది రూపాయల ఉద్యోగుల జీతాలను పెండింగ్​లో పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమం తమకు పట్టదన్నట్లుగా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్​లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇంతవరకూ డబ్బులు రాలేదన్న అశోక్ బాబు.. 3నెలలుగా అంగన్​వాడీలకు వేతనాలు లేవని విమర్శించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details