రాజధానిపై ఇవాళ మంత్రిమండలి భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. 3 ప్రాంతాల్లో రాజధానికి ఎంత ఖర్చవుతుందో శుక్రవారం చెబుతామని స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు. కేంద్రం ఐదేళ్లలో రాజధానికి ఇచ్చింది కేవలం రూ.1,500 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. రాజధానిని పూర్తిగా నిర్మిస్తామని విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదని వివరించారు. రాజధాని కోసం ఐదేళ్లలో రాష్ట్రం ఖర్చు పెట్టింది రూ.5,458 కోట్లేనని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో లక్షల కోట్లు అప్పు చేశారని... అయినా రాష్ట్రాభివృద్ధి జరగలేదని విమర్శించారు. చంద్రబాబులా తాము రైతులను మోసం చేయబోమని... సేకరించిన 33 వేల ఎకరాలను ఏం చేస్తామో త్వరలో చెబుతామని పేర్కొన్నారు. అమరావతిలోని 29 గ్రామాలను అభివృద్ధి చేయాలని కమిటీ చెప్పిందని వెల్లడించారు. చంద్రబాబుకి రాష్ట్రంపై నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు శుక్రవారం చెబుతామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
నూతన రాజధాని పేరేంటో చెబుతాం: మంత్రి బొత్స - రాజధాని వివాదం
రాష్ట్ర రాజధానిపై శుక్రవారం మంత్రివర్గంలో చర్చిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిలా గ్రాఫిక్స్, సినిమాలు చూపించమని వాస్తవాలే చెబుతామని వ్యాఖ్యానించారు.
మీడియాతో మంత్రి బొత్స
Last Updated : Dec 27, 2019, 4:55 AM IST