ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మున్సిపాలిటీలో రాజధాని గ్రామాల విలీనం తగదు'

By

Published : Feb 10, 2020, 11:49 PM IST

రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాలను ఇటీవల తాడేపల్లి మున్సిపాలిటీలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏకపక్షంగా విలీనం తగదని పిటిషనర్లు పేర్కొన్నారు.

ap capital amaravati
ap capital amaravati

రాజధాని గ్రామాలకు పొరుగునున్న ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతూరు సహా...రాజధాని పరిధిలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాలను గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ పురపాలకశాఖ ఈనెల 6న జీవో 97ను జారీచేసింది. దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, మరో ముగ్గురు కలిసి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

పెనుమాక, ఉండవల్లి గ్రామాలు ఇప్పటికే రాజధాని ప్రాంత పరిధిలో ఉన్నాయని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. రాజధాని కోసం భూసమీకరణలో విలువైన భూములిచ్చిన తమకు... ఫ్లాట్లు ఇవ్వలేదన్నారు. ఉగాది సందర్భంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు తాడేపల్లి మండల పరిధిలో భూములు లేనందున తాజాగా ఎనిమిది గ్రామాలను విలీనం చేశారని చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జోక్యం వలనే ఈ గ్రామాల విలీనం జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే సీఆర్డీఏ పరిధిలో ఉన్న పెనుమాక, ఉండవల్లి గ్రామాల్ని డినోటిఫై చేయకుండా మున్సిపాలిటీలో కలపడం కుదరదు అన్నారు. గ్రామ పంచాయతీల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం తగదని వివరించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవోను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్ కమిషనర్, తాడేపల్లి మున్సిపాలిటీ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్​తో పాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని వ్యక్తిగత హోదాలో వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి

పోలవరం నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details