హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై కొన్ని చోట్ల ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి. గురువారం రాత్రి నుంచి ఏకదాటిగా కురిసిన వర్షం వల్ల గురువారం సాయంత్రం ఓఆర్ఆర్ రాజేంద్రనగర్ ఎగ్జిట్–16 సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
పనులు జరుగుతున్న ప్రాంతంలో.. విరిగిపడ్డ కొండ చరియలు
హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై కొన్ని చోట్ల ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి.
![పనులు జరుగుతున్న ప్రాంతంలో.. విరిగిపడ్డ కొండ చరియలు landslides-broken-on-outer-ring-road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8841997-516-8841997-1600382131759.jpg)
పనులు జరుగుతున్న ప్రాంతంలో విరిగిపడ్డ కొండ చరియలు
విషయం తెలిసిన వెంటనే హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్, ఓఆర్ఆర్ అధికారులు హుటా హుటిన ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌ను మల్లించారు. పరిస్థితులను చక్కదిద్దారు. ఓఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా ఎత్తైన కొండలు, గుట్టల మధ్య నుంచి రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్న ప్రాంతంలోనే కొండ చరియలు విరిగిపడ్డాయి.