మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా మందడంలో ఉదయం నుంచే రోడ్లపై టెంట్లు వేసి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం అనవసర కమిటీలతో కాలయాపన చేస్తోందని రైతులు మండిపడ్డారు. 29 గ్రామాల అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటూ అవహేళన చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. అమాత్యులు టీవీల్లో కాకుండా రాజధాని గ్రామాల్లో డిబేట్లు పెట్టాలని అన్నారు. అవసరమైతే న్యాయపోరాటానికైనా వెనుకాడబోమని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. మరిన్ని వివరాలు.. మందడం నుంచి మా ప్రతినిధి అందిస్తారు.
'మంత్రులూ.. టీవీల్లో కాదు.. మాతో మాట్లాడండి..!' - farmers protests in mandadam
రాజధాని ప్రాంతాల్లో అన్నదాతలు వరుసగా 16వ రోజూ రోడ్డెక్కారు. మూడు రాజధానులు ప్రకటించడానికి ప్రభుత్వానికి ఏ అర్హత ఉందని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి ప్రకటన చేసిందని మండిపడ్డారు. తాము ఇంతగా నిరసన తెలుపుతున్నా మంత్రులు అవహేళన చేయడాన్ని తప్పుబట్టారు. అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.
'మంత్రులూ.. టీవీల్లో కాదు మాతో డిబేట్ చేయండి..!'