ETV Bharat / state

'అమరావతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం' - అమరావతి రైతుల ధర్నాలో ఎన్టీఆర్ కుటుంబం

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతుల అమరావతి పర్యటన రైతులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండి.. తమకు మద్దతు తెలిపేందుకు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వారు రైతుల్లో ధైర్యం నింపారు.

ntr-family-supports-amaravathi-farmers-agitation
రాజధాని రైతులకు ఎన్టీఆర్ కుటుంబీకుల సంఘీభావం
author img

By

Published : Jan 2, 2020, 6:11 AM IST

రాజధాని రైతులకు ఎన్టీఆర్ కుటుంబీకుల సంఘీభావం

ప్రజారాజధానిగా అమరావతే ఉండాలంటూ 15 రోజుల పాటు రైతులు చేస్తున్న దీక్షలకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, కుమార్తె, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రైతుల ఆందోళనల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండి... దీక్షల్లో పాల్గొనడం రైతులు, మహిళల్లో మరింత స్ఫూర్తిని నింపింది.

ఉద్యమానికి మద్దతుగా చేతి గాజు విరాళం

మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతు నిరసనల్లో పాల్గొన్న ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. మహిళలు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం తానెప్పుడూ చూడలేదని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా అమరావతి కలను నెరవేర్చుకుందామని మహిళలకు పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతుగా తన చేతి గాజును విరాళంగా అందజేశారు. రైతుల దుస్థితి చూడలేకపోతున్నానంటూ ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. అమరావతి సాధించేవరకూ రైతుపక్షాన పోరాడతామని తేల్చిచెప్పారు.

16వ రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 16వ రోజుకు చేరుకున్నాయి. నేటి నుంచి ప్రకాశం జిల్లాలోనూ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు అమరావతికి మద్దతుగా నిరసనలు చేపట్టనున్నాయి.

ఇదీ చదవండి :

'రాజధాని కొనసాగించాలని కోరుతూ... సంతకాల సేకరణ'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.