ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం నియంత్రణలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

By

Published : Nov 7, 2019, 9:02 PM IST

మద్య నిషేదానికి చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వైన్ షాపులపై నియంత్రణలు విధించిన వైకాపా సర్కార్​ తాజాగా బార్లపై దృష్టి పెట్టింది.

cm jagan

మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్య తగ్గించాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకే బార్లలో మద్యం అమ్మకాలు జరపాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details