రాజధాని ప్రాంత రైతులకు తెదేపా అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఆ పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు సంఘీభావంగా త్వరలో చంద్రబాబు పర్యటిస్తారని వెల్లడించారు. తుళ్లూరులో రైతుల మహాధర్నాలో పాల్గొని ప్రసంగించిన ఆయన... సీఆర్డీఏకు చట్టబద్ధత ఉన్నందున... అమరావతికి భూములిచ్చిన రైతులు అధైర్యపడొద్దని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రైతులకు న్యాయం చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఓ పక్క ప్రజా పోరాటం.. మరోవైపు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. జీఎన్ రావు నివేదిక అంతా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. ఈ కమిటీ నివేదిక.. జగన్ మనసులో నుంచి వచ్చిందేనని అన్నారు. జీఎన్ రావు కమిటీ రాజధానిలో ఎక్కడా పర్యటించలేదని ఉమ దుయ్యబట్టారు. ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని.. ఇప్పుడు దానిని ఆపేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని జగన్ ప్రశిస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. అమరావతిని అందరం కలిసి కాపాడుకుందామని అన్నారు.
'రైతులకు సంఘీభావంగా... త్వరలో చంద్రబాబు పర్యటన'
అమరావతి ప్రాంత రైతులకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందని దేవినేని ఉమ అన్నారు. రైతులకు మద్దతుగా త్వరలో చంద్రబాబు ఈ ప్రాంతంలో పర్యటిస్తారని వెల్లడించారు.
చంద్రబాబు(పాతచిత్రం)