ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vaccination: ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌

By

Published : Jun 8, 2021, 2:45 PM IST

Updated : Jun 9, 2021, 12:27 AM IST

ఏపీలో చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌
Vaccination in ap

14:40 June 08

చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌.. ఏర్పాట్లకు ఆదేశాలు

రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల పంపిణీ స్వరూపం మారబోతోంది. ఇప్పటివరకూ ఎంపిక చేసిన 3 కేటగిరీల వారికే టీకాలు ఇస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి ఐదేళ్ల పిల్లలు కలిగిన తల్లులకు టీకా వేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. వీరి సంఖ్య 15నుంచి 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇదే సమయంలో కేంద్రం ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేస్తామని ప్రకటించింది. దీని ప్రకారం లబ్ధి పొందేవారు రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ జాబితాలోకే తల్లులూ వస్తారు. అయినా ప్రతి గ్రామంలో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టోకెన్లు పంపిణీ చేసి, టీకా పంపిణీ ప్రారంభించాలని ప్రజారోగ్యశాఖ సంచాలకులు గీతాప్రసాదిని ఉత్తర్వులు జారీ చేశారు.

    రాష్ట్రంలో జనవరి 16న టీకా పంపిణీ ప్రారంభమవ్వగా మొదటి డోసులో ప్రభుత్వం ఎంపిక చేసిన 3 కేటగిరీల్లో కలిపి సుమారు 55.25 శాతం మంది, రెండో డోసులో 17.12 శాతం మంది చొప్పున టీకా పొందారు. ఈ టీకాల పంపిణీ ఒక్కో జిల్లాలో ఒక్కోలా సాగుతోంది. కొవిషీల్డ్‌ కంటే కొవాగ్జిన్‌ తక్కువగా రావడం వల్ల కొవాగ్జిన్‌ను ఎంపికచేసిన ప్రదేశాలకే పంపిస్తున్నారు. దీనివల్ల అన్ని జిల్లాల్లో పంపిణీ ఒకేసారి జరగడంలేదు. వ్యాక్సిన్‌ రాకను బట్టి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇదీ చదవండి

'సీఎం గారూ.. ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించండి'

Last Updated : Jun 9, 2021, 12:27 AM IST

ABOUT THE AUTHOR

...view details