ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అభివృద్ధిని వికేంద్రీకరించాలి.. పరిపాలనను కాదు'

By

Published : Feb 27, 2020, 1:30 PM IST

రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదని అభిప్రాయపడింది.

ap editors assosiation on three capital
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యయనం చేసిందని సంస్థ అధ్యక్షుడు కృష్ణంరాజు తెలిపారు. విశాఖలో స్థానికుల కంటే స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారని, గతంలో తెలంగాణ ఉద్యమమూ స్థానికేతరుల వల్లనే వచ్చిందని చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు విశాఖలో సముద్ర మార్గం ద్వారా శత్రువులు దాడికి యత్నించారని తెలిపారు. విశాఖ తీరంలో అణు జలాంతర్గాముల కేంద్రం ఉందని... ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రేడియేషన్ ప్రభావం నగరంపై పడుతుందన్నారు. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పరిపాలన రాజధానిపై పునరాలోచించాలని సూచించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details