మీడియా ప్రతినిధులపై దాడికేసులో ఆరుగురు రాజధాని రైతులకు మంగళగిరి అదనపు సివిల్ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం ఉదయం మందడంలో అదుపులోకి తీసుకున్న బండారు నాగరాజు, దానసిరి నరేష్, గోగులపాటి సురేంద్ర, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, రామినేని నరసింహ స్వామి, బుక్యా లోకనాయక్ను అరెస్టు చేసి తెనాలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రైతులను మంగళగిరి న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రైతులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదివారం రాత్రికి గుంటూరు తాలుకా పోలీస్ స్టేషన్లో ఉంచి సోమవారం ఉదయం జిల్లా న్యాయస్థానానికి తరలించనున్నారు.
అరెస్టైన రాజధాని రైతులకు 14 రోజుల రిమాండ్ - amaravathi farmers arrest news
మీడియా ప్రతినిధులపై దాడి కేసులో అరెస్టు చేసిన ఆరుగురు రాజధాని రైతులకు మంగళగిరి అదనపు సివిల్ న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది.
అరెస్టైన రాజధాని రైతులకు 14 రోజుల రిమాండ్