టీడీపీ ఆఫీస్‌పై దాడికేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 12:46 PM IST
YSRCP Bail Petition Postpone on TDP Office Attack Case : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నాయకుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి జరగనుంది. అరెస్ట్‌పై తొందరపాటు చర్యలు వద్దని, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.