వివాహేతర సంబంధం - భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2024, 7:41 PM IST
Wife Killed Husband In Satyasai District:వేధిస్తున్నాడని భర్తను భార్య రోకలిబండతో కొట్టి చంపిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ధర్మవరం మండలం ధర్మపురి గ్రామంలో దేవరకొండ గోవిందు అనే వ్యక్తి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ మద్యం తాగి వచ్చి తన భార్య అంజమ్మను తరచూ కొట్టడం చేస్తూ ఉండేవాడు. దీంతో అంజమ్మ ఆగ్రహానికి గురై రోకలిబండతో గోవిందు తలపై మోది హత్య చేసింది. అనంతరం ఆమె నేరుగా ధర్మవరం పోలీసులకు లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోవిందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.