సముద్రంలో ఓ యువకుడు గల్లంతు - మరొకరిని కాపాడిన మత్స్యకారులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2024, 9:02 AM IST
Missing in Suryalanka beach in Bapatla district : బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్రతీరంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సరదాగా వెళ్లి సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక యువకుడిని మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు చేర్చగా మరో యువకుడు గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు గాలిస్తున్నారు. సూర్యలంక బీచ్లో గతంలో వరుసగా ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం బాపట్ల, చీరాల బీచ్లో సందర్శకుల రాకపోకలను నిలిపివేసింది. సూర్యలంక బీచ్ సురక్షితమే అయినా అక్కడ కూడా కొద్ది రోజులపాటు సముద్ర స్థానాలకు పర్యాటకులను అనుమతించలేదు. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం పర్యాటకులకు, అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.