ETV Bharat / state

ఆ విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు- ‘అన్న క్యాంటీన్‌’ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టు - CHARITABLE TRUST FOR ANNA CANTEEN

ఆన్‌లైన్‌లోనే విరాళాల సేకరణ, రసీదుల జారీ- రోజూ రూ.కోటికి పైగా రాయితీ భరిస్తున్న ప్రభుత్వం

charitable_trust_in_the_name_of_anna_canteen
charitable_trust_in_the_name_of_anna_canteen (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 10:50 AM IST

Charitable Trust in The Name of Anna Canteen : అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఇక నుంచి ఆదాయ పన్ను మినహాయింపు లభించనుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించనున్నారు. ఇందుకోసం ‘అన్న క్యాంటీన్‌’ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు లభించాయి. వచ్చే నెలలో ట్రస్టు ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న అన్నక్యాంటీన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 204 క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మూడుపూటలా కలిపి రోజూ రూ. 1.50 లక్షల మందికిపైగా భోజనం చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రోజూ రూ.కోటికిపైగా రాయితీ కింద ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరికి మూడు పూటలా భోజనం ఖర్చు రూ.90 కాగా ఇందులో రూ.15 వసూలు చేస్తూ, మిగిలిన రూ.75 ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది.

అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు రావడంతో దీన్ని ఛారిటబుల్‌ ట్రస్టుగా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. ట్రస్టు రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ సిద్ధం చేశారు.

రూ.26.25 లక్షల విరాళమిస్తే రోజంతా వారి పేరుతో ఆహారం : రాష్ట్రంలో మొదటిదశలో 100 అన్నక్యాంటీన్లలో పేదలకు భోజనం అందించేందుకు మూడు పూటలకూ కలిపి, విడివిడిగా దాతల నుంచి విరాళాలు సేకరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వంద క్యాంటీన్లలో అల్పాహారానికైతే రూ.5.95 లక్షలు, మధ్యాహ్న భోజనానికి రూ.10.15 లక్షలు, రాత్రి భోజనానికి రూ.10.15 లక్షలు చొప్పున విరాళాలు సేకరించనున్నారు. మూడు పూటలకూ కలిపి రూ.26.25 లక్షలు సమకూర్చాలి. విరాళాలిచ్చేవారికి ఆన్‌లైన్‌లోనే రసీదులు జారీచేస్తారు. వీటిద్వారా ఆదాయపన్ను మినహాయంపు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. దాతల వివరాలు క్యాంటీన్లలో తెరలపై ప్రదర్శిస్తారు.

ఇవాళ మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

⦁ రాష్ట్రంలో ప్రారంభించిన అన్నక్యాంటీన్లు: 204

⦁ ఇప్పటివరకు జారీచేసిన మొత్తం టోకెన్లు: 60,39,520

⦁ అల్పాహారం: 22,37,623

⦁ మధ్యాహ్న భోజనం: 23,42,447

⦁ రాత్రి భోజనం: 14,59,450

ఇప్పటివరకు అత్యధికంగా టోకన్లు జారీ చేసిన జిల్లాలు
అనంతపురం6,39,542
గుంటూరు6,30,018
విశాఖపట్నం4,47,002
కాకినాడ4,21,583
నెల్లూరు4,14,219

రెండో విడత అన్న క్యాంటీన్లు ప్రారంభం- స్వయంగా అన్నం వడ్డించిన సీఎం - second phase of Anna Canteens

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.