TG SSC Supplementary Results 2024 : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 73.03 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు హాజరైన 46,731 మంది విద్యార్థుల్లో 34,126 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలురు 71.01 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 76.37 శాతంగా ఉంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు జులై 8 వరకు అవకాశం కల్పించారు.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - 73.03 శాతం ఉత్తీర్ణత
Published : Jun 28, 2024, 4:50 PM IST
TG SSC Supplementary Results 2024 (ETV Bharat)
అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో నిర్మల్ జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. కేవలం 42.14 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు అయింది. www.bse.telangana.gov.in వెబ్ సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.