national

వారికి రుణమాఫీ లేదు - తేల్చి చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి !

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 10:05 AM IST

cm_revanth_reddy_on_runa_mafi
cm_revanth_reddy_on_runa_mafi (ETV Bharat)

CM Revanth Reddy on Runa Mafi : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తుందా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 2 లక్షల రూపాయల వరకూ రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో ప్రకటిస్తాని అన్నారు. అయితే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాలను అనుసరించి తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు మాఫీ చేయబోమని తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details