national

సీపీఐ సీనియర్‌ నేత ధూళిపాళ్ల సీతారామచంద్రరావు కన్నుమూత

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 10:15 AM IST

Senior CPI Leader Dhulipalla
Senior CPI Leader Dhulipalla Sitaram Chandra Rao Passed Away (ETV Bharat)

Senior CPI Leader Dhulipalla Sitaram Chandra Rao Passed Away : సీపీఐ సీనియర్‌ నేత ధూళిపాళ్ల సీతారామచంద్రరావు మృతి చెందారు. కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో సీతారామచంద్రరావు తుదిశ్వాస విడిచారు. కాగా సీపీఐ శ్రేణులు, బంధుమిత్రుల సందర్శనార్థం కొండాపూర్ వృద్ధాశ్రమంలో భౌతికకాయాన్ని ఉంచారు. అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గం. వరకు మగ్దూం భవన్‌కు భౌతికకాయాన్ని తరలించనున్నారు. గతంలో కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details