మన దేవరకు మన సరకు - తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా పలాస జీడిపప్పు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 12:22 PM IST
Palasa Cashew Are Using In Tirumala Prasadam Making :తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పును పంపించారు. జీడి పప్పు తీసుకెళ్తున్న వాహనాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జెండా ఊపి ప్రారంభించారు. జీడిపప్పు సరఫరా చేసేందుకు కాశీబుగ్గ పారిశ్రామికవాడలోని ఎస్‌ఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ఉత్పత్తుల సంస్థకు ఇటీవల టెండర్ ఖరారైంది. ఈ మేరకు 10 టన్నుల సరకును పంపించారు. నాణ్యతలో రాజీ పడకుండా మేలురకం పంపిస్తామని సంస్థ యజమాని సంతోష్ కుమార్ తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి జీడిపప్పు పంపించడం ఆనందంగా ఉందని అన్నారు.