national

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 12:50 PM IST

ETV Bharat / snippets

కోల్​కతా వైద్యురాలి హత్యాచార కేసు - నిరసనగా నిమ్స్‌లో ఓపీ సేవలు బహిష్కరణ

NIMS DOCTORS PROTEST IN HYDERABAD
NIMS Staff Boycott OP over kolkata Doctor Rape (ETV Bharat)

NIMS Staff Boycott OP over kolkata Doctor Rape : కోల్​కతా ఆర్​జీ కార్ వైద్యకళాశాల ఆసుపత్రిలో జూనియర్​ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా నిమ్స్ ఆసుపత్రిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలను, ఎలెక్టివ్ సర్జరీలను బహిష్కరించారు. అత్యవసర సేవలను కొనసాగించనున్నటు నిమ్స్ సిబ్బంది పేర్కొన్నారు. ఆర్​జీ కార్ ఘటన కేవలం వైద్యులకు సంబంధించింది కాదన్న నిమ్స్ సిబ్బంది, ప్రతి మహిళకు రక్షణ కరవైందని పేర్కొన్నారు. తమ రక్షణ కోసం పోరాడుతున్నామన్న వైద్యులు, కేంద్ర ప్రభుత్వం కఠినమైన భద్రతా చట్టాలు తెచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details