ETV Bharat / snippets

గొర్రెల మందపై కుక్కల దాడి - 15 మూగజీవాల మృత్యువాత

author img

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

DOGS ATTACK ON SHEEPS
SHEEPS INJURED IN DOG ATTACK (ETV Bharat)

Dogs Attack on Sheeps : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కలు గొర్రెల మందపై తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతి చెందగా, మరో 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం కారేపల్లి మండలం బొడ్రాయి సెంటర్​లోని జంగా మధు అనే వ్యక్తి ఇంట్లో గొర్రెల మందను గమనిస్తూ ఉన్న కుటుంబసభ్యులు క్షణాల వ్యవధిలో బయటకు వెళ్లడంతో ఒక్కసారిగా వచ్చిన కుక్కల గుంపు గొర్రెల మందపై స్వైర విహారంతో దాడి చేశాయి.

దాదాపుగా రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని యజమాని జంగా మధు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి, పరిహారం అందించాలని కోరారు. వీధి కుక్కలు చిన్న పిల్లలతో సహా అనేక మందిపై దాడి చేస్తున్నాయని, వెంటనే ప్రభుత్వం సమస్యకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటివల్ల వీధుల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.