International Telugu Mahasabhalu :ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరిలో అమరావతిలో నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ రాష్ట్రపతి, ప్రధానిని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలుగువారు ఎక్కువగా నివసించే దేశాల అధ్యక్షులు, ప్రధానులను కూడా ఆహ్వానిస్తామన్నారు.
అమరావతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తాం : గజల్ శ్రీనివాస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2024, 3:33 PM IST
2022లో భీమవరంలో 2024లో రాజమహేంద్రవరంలో మహాసభలు నిర్వహించామని, ఇదే స్ఫూర్తితో ఈసారి అమరావతిలో జరపాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. తెలుగు భాషా వైభవాన్ని పరిరక్షించి, తెలుగు కీర్తిని నలుదిశలా చాటటంతో పాటు నేటి తరాలకు మన భాష గొప్పదనాన్ని తెలియజెప్పటమే ఈ సమావేశాల లక్ష్యమన్నారు. ఈ మహాసభలకు కన్వీనర్‌గా రామచంద్రరాజుని నియమించారు. మహాసభల్ని జయప్రదంగా నిర్వహించటం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కన్వీనర్ రామచంద్రరాజు తెలిపారు.