Published : May 25, 2024, 3:23 PM IST
ఆన్లైన్ ఆర్డర్లతో డబ్బు మళ్లింపు - బయటపడ్డ బీటెక్ బాబు బాగోతం
Food Delivery Boy Cheating In Grill-9 Hotel :ఆన్లైన్ ఆర్డర్లతో డబ్బులు మళ్లిస్తూ మోసం చేస్తున్న ఫుడ్ డెలవరీ బాయ్ బండారం బయటపడింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. లాలాపేట్‌కు చెందిన సందీప్ అనే వ్యక్తి బీటెక్ పూర్తిచేసి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కార్ఖానాలోని గ్రిల్-9 హోటల్ పేరుమీద ఫ్రాంచైజీ తెరచి ఫుడ్ ఆర్డర్లు తీసుకున్నాడు. స్విగ్గిలో ఆర్డర్లు వస్తున్నప్పటికీ ఖాతాలో మాత్రం డబ్బులు జమ కావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన అసలైన హోటల్ యాజమాన్యం ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. స్విగ్గి ద్వారా ఆన్లైన్ డెలవరీలను చేస్తూ హోటల్ పేరిట మరో అకౌంట్ ఓపెన్ చేసి అందులోని డబ్బులు దారి మళ్లినట్లు యాజమాన్యం గుర్తించింది. స్విగ్గిలో చేసినట్లే జొమాటోలో మోసానికి పాల్పడేందుకు ప్రయత్నించగా అసలైన గ్రిల్-9కు మెసేజ్ రావడంతో సందీప్ మోసానికి తెర పడింది. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు సందీప్‌ను రిమాండ్‌కు తరలించారు.