Police Complaint On Ex CM KCR: మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఎక్కడున్నా వెతకాలంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు కార్యకర్తలతో కలిసి గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
'కేసీఆర్ కనిపించడం లేదు - ఎక్కడున్నా వెతకి పెట్టండి'
Published : 5 hours ago
Police Complaint On Ex CM KCR (ETV Bharat)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు సీఎంగా ఉండి గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండని కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా గజ్వేల్ ఎమ్మెల్యేగానైనా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలన్నారు. ఈ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పది రోజుల్లో పోలీసులు వెతికి పట్టుకోకుంటే, తామే ఆయన ఆచూకీ కోసం వెతకడం ప్రారంభిస్తామన్నారు.