ETV Bharat / snippets

పేదల పెన్నిధిగా త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం : మంత్రి పొంగులేటి

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

New Revenue Act
Minister Ponguleti On New Revenue Act (ETV Bharat)

Minister Ponguleti On New Revenue Act : రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుంచి ముఖ్యంగా ధరణి పోర్టల్, ఆర్వోఆర్ చట్టం 2020 ద్వారా ప్రజలు పడుతున్న కష్టాలు, బాధల నుంచి విముక్తి కల్పించేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం 2024ను తీసుకురానున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ధరణితో ప్రజలు అభద్రతకు గురయ్యారని ఆయన అన్నారు. ఆ సమస్యలన్నింటి నుంచి నూతన రెవెన్యూ చట్టం విముక్తి కల్పిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. కొత్త చట్టం తీసుకొచ్చే ముందే గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగాన్ని పునరుద్ధరిస్తామన్నారు. 33 జిల్లాలకు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉంటారని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.