national

నేడు గుజరాత్‌కు చంద్రబాబు - ఎందుకంటే?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 10:21 AM IST

CM Chandrababu Gujarat Tour
CM Chandrababu Gujarat Tour (Etv Bharat)

CM Chandrababu Gujarat Tour :ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గుజరాత్‌ వెళ్లనున్నారు. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో జరిగే 4వ గ్లోబల్‌ రెన్యుబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్, ఎక్స్‌పో (Re-Invest 2024) సదస్సులో ఆయన పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌కర్‌ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సదస్సులో రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అధికారులు కూడా పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details