national

మరోసారి ట్రాప్‌ కెమెరాకు చిక్కిన చిరుత- భయాందోళనల్లో ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 9:56 AM IST

cheetah_in_east_godavari_district
Etcheetah_in_east_godavari_district (ETV Bharat)

Cheetah Spotted in Rajahmundry DFO Bharani on Leopard Roaming :రాజమహేంద్రవరం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత మరోసారి ట్రాప్‌ కెమెరాకు చిక్కింది. దివాన్ చెరువు అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో రికార్డయిన ఫొటోను అటవీశాఖ అధికారులు విడుదల చేశారు. చిరుత పాదమూత్రలు గుర్తించినట్లు తెలిపారు. దివాన్ చెరువు అభయారణ్యం లోపల, బయట ప్రాంతాల్లో మనుషులు, పశువులకు చిరుత ఎలాంటి హాని తలపెట్టలేదని డీఎఫ్​ఓ భరణి తెలిపారు. చిరుతను బంధించేందుకు మరిన్ని బోన్లు ఏర్పాటు చేశామని వివరించారు. ట్రాప్ కెమెరాను మార్చి వివిధ ప్రదేశాల్లో అమర్చామన్నారు. చుట్టుపక్కల గ్రామాల వాసులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రాత్రిపూట ఇంటి వద్ద లైట్లు వేయాలని, ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని, వదంతులు నమ్మొద్దని భరణి విజ్ఙప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details