తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం - ఎంతంటే?
Published : Oct 1, 2024, 8:19 PM IST
Central Govt Announced Flood Aid to Telugu States : దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ రూ.5,858.60 కోట్లు రిలీజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు, నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన రిపోర్ట్ మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది. కేంద్ర బృందాల నుంచి కంప్లీట్ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.416.80 కోట్లు మంజూరు చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయాన్ని కేంద్రం ప్రకటించింది.