Disqualification of BRS MLAs : ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణలతో చర్చించింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌పై సభాపతి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ పేర్కొంది. ఉన్నత న్యాయస్థానం తీర్పులో పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది.
Published : Jun 24, 2024, 2:21 PM IST
ఎమ్మెల్యేల వరుస పార్టీ ఫిరాయింపులు - సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్
BRS to go to Supreme Court (ETV Bharat)
BRS to Supreme Court MLAsDisqualification : దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తి కానుంది. ఈ నెల 27న హైకోర్టులో ఆయన అనర్హత అంశంపై విచారణ జరగనుంది. ఆయనపైన అనర్హత వేటు వేయకుంటే, సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల అందరిపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది.