national

ఎమ్మెల్యే కోవ లక్ష్మికి అస్వస్థత - హైదరాబాద్​ తరలింపు

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 8:57 PM IST

Asifabad MLA Kova Laxmi Ill
Asifabad MLA Kova Laxmi Ill (ETV Bharat)

Asifabad MLA Kova Laxmi Ill : కుమురం భీం ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గత 3 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్య వచ్చి ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స కోసం తరలించారు.

ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఆమెను పరామర్శించారు. డాక్టర్​ పరిశీలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించే క్రమంలో తన సొంత వాహనంలోనే ఆక్సిజన్​ సిలిండర్​ అమర్చి హైదరాబాద్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details