national

ETV Bharat / snippets

పోలీసు భద్రతకు పొన్నవోలు అనర్హులు - తేల్చి చెప్పిన హైకోర్టు

Ponnavolu Sudhakar Petition
Ponnavolu Sudhakar Petition (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 10:24 PM IST

AP High Court on Ponnavolu Sudhakar Petition: రాజ్యాంగ, చట్టబద్ధ పదవులను నిర్వహించని కారణంగా పోలీసు భద్రతను పొందేందుకు అనర్హులని మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రాణహాని లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) సైతం ఇప్పటికే తేల్చిందని హైకోర్టు గుర్తుచేసింది. ఆ కమిటీ నివేదికపై ఏమైనా అభ్యంతరం ఉంటే సవాలు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ ప్రాణహాని ఉందని నిర్ధారణ అయి ప్రభుత్వం పోలీసు భద్రతను కల్పిస్తే అందుకు అయ్యే ఖర్చును పొన్నవోలు భరించాలని వెల్లడించింది. తనకు భద్రత కల్పించాలని కోరుతూ మాజీ ఏఏజీ పొన్నవోలు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది.

ABOUT THE AUTHOR

...view details