హైదరాబాద్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం
Published : Jul 5, 2024, 9:03 PM IST
|Updated : Jul 5, 2024, 10:27 PM IST
Grand welcome TO AP CM Chandra Babu Naidu :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్‌లో టీడీపీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. దిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు. ఓ వైపు కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ అవేవీ లెక్క చేయకుండా అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. బేగంపేట నుంచి జూబ్లిహిల్స్‌లో ఆయన నివాసం వరకు అభిమానులు ర్యాలీ నిర్వహించారు.