Man Halchal in Gun at Suddakuntapalli :శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ యువకుడు తుపాకీతో హల్చల్ చేశాడు. రామగిరి మండలం సుద్దుకుంటపల్లికి చెందిన గంగాధర్ అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు అతడిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారు తనపై కేసును ఉపసహరించుకునేలా చేయాలని అనుకున్నాడు.
లైంగిక వేధింపులు ఆపై తుపాకీతో బెదిరింపులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 10, 2024, 8:17 PM IST
Man Halchal in Gun at Suddakuntapalli (ETV Bharat)
ఈ క్రమంలోనే ఇవాళ బాధితురాలి భర్త కేశవతో తనపై కేసును ఉపసహరించుకోవాలని గన్తో గంగాధర్ బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన కేశవ కుటుంబ సభ్యులు అతడిని చితకబాది తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రామగిరి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గంగాధర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.