Dwayne Bravo Retirement:వెస్టిండీస్ లెజెండరీ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే బ్రావో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. తాజాగా పూర్తిగా క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న సీపీఎల్ తన కెరీర్లో ఆఖరి టోర్నీ అని పేర్కొన్నాడు.
ప్రొఫెషనల్ క్రికెట్‌కు బ్రావో గుడ్ బై- లాస్ట్ CPL ఇదే
Published : Sep 1, 2024, 8:23 PM IST
'ఇది గొప్ప ప్రయాణం. ఈరోజు సీపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. నా కెరీర్లో ఇదే లాస్ట్ సీజన్. నా కరీబియన్ ఫ్యాన్స్ మధ్యలో ఆఖరి మ్యాచ్ ఆడేందుకు ఆత్రుతగా ఉన్నా. ఎక్కడైతే ప్రారంభించానో అక్కడే ముగిస్తున్నా' అని బ్రావో రాసుకొచ్చాడు.
కాగా, 2006నుంచి టీ20 ఫార్మాట్లో ఆడుతున్న బ్రావో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల డొమెస్టిక్ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించాడు. టీ20ల్లో ఓవరాల్‌గా 600+ వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్లో పలు ఫ్రాంచైజీల తరఫున 161 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 1560 పరుగులు, 183 వికెట్లు దక్కించుకున్నాడు.