రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం
Published : Aug 8, 2024, 4:18 PM IST
ParisOlympics AntimPanghal Banned : భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్కు భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) షాక్ ఇచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటం వల్ల మూడేళ్ల నిషేధం విధించింది. అంతిమ్ భారత్‌కు వచ్చిన తర్వాత నిషేధం గురించి ఐవోఏ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉందట. అంతిమ్ తన సోదరిని ఒలింపిక్ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌తో పంపించడం వల్ల ఐవోఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తన వస్తువులు కొన్ని ఒలింపిక్స్ విలేజ్‌లో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి తీసుకురమ్మని అంతిమ్ చెప్పిందట. అందుకు తన అక్రిడిటేషన్ కార్డును ఇచ్చిందట. దీంతో నిశా ఒలింపిక్ విలేజ్‌లోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండటం వల్ల సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడ్డారు. ఆమెతో పాటు అంతిమ్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారట. దీంతో అంతిమ్ అక్రిడిటేషన్ దుర్వినియోగం అయినట్లు ఒలింపిక్ నిర్వాహకులు భావించి దానిని రద్దు చేసి ఐవోఏ దృష్టికి తీసుకొచ్చారట.