Paris Olympics 2024లో మొదటి రోజు భారత షూటర్లకు నిరాశ తప్పలేదు. 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రమిత- అర్జున్ బబుతా, ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్ జోడీలు ఫైనల్‌కు వెళ్లలేకపోయాయి.
గురితప్పిన తూటా - నిరాశపర్చిన షూటర్లు
Published : Jul 27, 2024, 1:49 PM IST
క్వాలిఫికేషన్ రౌండ్లో రమిత-అర్జున్ బబుతా జోడీ 628.7 స్కోర్‌తో ఆరో స్థానంలో నిలిచింది. మరో జోడీ వలరివన్- సందీప్ సింగ్ 626.3 పాయింట్లతో 12 స్థానంలోనే నిలిచింది. దీంతో టాప్-4లో ఉన్న వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
ఇక రోయింగ్ మెన్స్ సింగిల్ స్కల్స్ హీట్స్‌లో భారత్ అథ్లెట్ బాల్‌రాజ్ పన్వర్ నాలుగో స్థానంలో నిలిచాడు. హీట్ 1లో అతడు 7:07.11 నిమిషాల్లో రేసును కంప్లీట్ చేశాడు. దీంతో నాలుగో స్థానంలో ఉండటం వల్ల రెపిచేజెస్ రౌండ్‌కు చేరుకున్నాడు. అంటే సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు వెళ్లేందుకు అతడికి మరో ఛాన్స్ దక్కింది.