national

ETV Bharat / snippets

బాబర్ సోషల్ మీడియా కింగ్ మాత్రమే- పాక్ ఫెయిల్యూర్​కు కారణం అదే!

Pakistan T20 World Cup
Pakistan T20 World Cup (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 5:32 PM IST

Pakistan T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​లో పాకిస్థాన్ సూపర్- 8కు అర్హత సాధించడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్లేయర్ అహ్మద్ షహబాజ్ కూడా తాజాగా స్పందించాడు. జట్టులోని ప్లేయర్లు సొంత మైలురాళ్ల కోసం ఆడడమే పాక్ వైఫల్యానికి ప్రధాన కారణం అని చెప్పాడు. బాబర్ ఆజమ్​ను తిరిగి కెప్టెన్​గా ఎంపికచేయడాన్ని కూడా తప్పుబట్టాడు. 'జట్టులో ఆటగాళ్లు సొంత రికార్డుల కోసం ఆడుతుండడం వల్ల పాక్ క్రికెట్ ఈ స్థాయికి పడిపోయింది. బాబర్ ఆజమ్ కేవలం సోషల్ మీడియా కింగ్. టీమ్​ ప్లేయర్లకు ఫిట్​నెస్ లేకపోయినా జట్టులో రాజకీయాలు చేస్తుంటారు. బాబర్​ను మళ్లీ కెప్టెన్​గా ఎంపికచేయడం పీసీబీ చేసిన అతిపెద్ద తప్పిదం' అని అన్నాడు. కాగా, ప్రస్తుత టోర్నీలో ఇప్పటివరకు 3మ్యాచ్​లు ఆడిన పాక్ 1దాంట్లోనే నెగ్గింది.

ABOUT THE AUTHOR

...view details