national

ETV Bharat / snippets

సూపర్​ 8లో రోహిత్ సేన దూకుడు-హ్యాట్రిక్​ విన్​ కోసం ఎదురుచూపు!

India Vs Australia T20 World Cup 2024
India Vs Australia (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 6:36 PM IST

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌ల్లో భాగంగా సెయింట్‌ లూసియా వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇటీవలి మ్యాచ్​లో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌పై గెలుపొందిన భారత్‌, ఆసీస్‌పై కూడా నెగ్గి హ్యాట్రిక్‌ విజయాలతో నేరుగా సెమీస్‌కు చేరుకోవాలనుకుంటోంది.

ఈ టోర్నీలో పెద్దగా రాణించని కోహ్లీ, శివమ్‌ దూబే అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో దూసుకెళ్లడం టీమ్​ఇండియాకు కలిసి వచ్చిన అంశం. హర్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండర్‌ పెర్ఫామెన్స్​ సత్తా చాటగా, స్పిన్నర్‌ కులదీప్‌ యాదవ్‌ మిడిల్‌ ఓవర్లలో వికెట్లతో రాణిస్తున్నాడు. పేసర్లు బుమ్రా, అర్షదీప్‌ చక్కని పెర్ఫామెన్స్​తో ఆకట్టుకుంటున్నారు.

మరోవైపు బంగ్లాదేశ్‌పై గెలిచి అఫ్గాన్ చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్న ఆసీస్​, ఇప్పుడు సెమీస్‌ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌ ఫలితంపై ఆసీస్‌ సెమీస్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌ స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details