Afg vs Sa Semi FInal:2024 టీ20 వరల్డ్‌కప్ తొలి సెమీఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. ఈ కీలకమైన పోరులో సౌతాఫ్రికా- అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో సౌతాఫ్రికా అజేయంగా సెమీస్‌కు అర్హత సాధిస్తే, అఫ్గాన్ సంచలన విజయాలతో దూసుకువచ్చింది. కీలకమైన సెమీస్‌లోనూ జోరు ప్రదర్శించి ఫైనల్ దూసుకెళ్లాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఈ రెండింట్లో ఏ జట్టు నెగ్గినా ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
ఫైనల్‌కు దూసుకెళ్లేదెవరో- ఎవరు నెగ్గినా ఫస్ట్ టైమ్
Published : Jun 26, 2024, 6:02 PM IST
డికాక్, క్లాసెన్, మిల్లర్, మర్క్రమ్, రబాడా, నోకియా సౌతాఫ్రికాకు కీలకం కానున్నారు. బ్యాటింగ్‌లో డికాక్, మిల్లర్, మర్క్రమ్ రాణిస్తే సఫారీలకు భారీ స్కోర్ ఖాయం. రబాడ, నోకియా బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇక గుర్బాజ్, జద్రాన్, ఒమర్జాయ్, నైబ్, రషీద్, నూర్, నవీనుల్‌తో అఫ్గాన్ కూడా బలంగానే ఉంది. చూడాలి మరి ఎవరు ఫైనల్‌కు దూసుకెళ్తారో. ట్రినిడాడ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.