ETV Bharat / snippets

'ఆ ఫోన్ చేసినందుకు థాంక్స్- ఇదంతా నీ వల్లే రోహిత్!'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 7:54 AM IST

Updated : Jul 3, 2024, 8:34 AM IST

Dravid Thanked Rohit
Dravid Thanked Rohit (Source: Associated Press)

Dravid Thanked Rohit: 2023 వన్డే వరల్డ్​కప్ ఓటమి తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకున్న తనను కెప్టెన్ రోహిత్ శర్మే ఆపాడని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. దానివల్లే ప్రస్తుత విజయాన్ని ఆస్వాదిస్తున్నానని ద్రవిడ్ అన్నాడు. టీమ్ఇండియా రీసెంట్​గా టీ20 వరల్డ్​కప్ నెగ్గిన నేపథ్యంలో ద్రవిడ్, డ్రెస్సింగ్ రూమ్​లో ప్లేయర్లతో పలు అంశాల గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా కామెంట్స్ చేశాడు.

'నవంబర్లో ఫోన్ చేసి నన్ను కోచ్​గా కొనసాగాలని అడిగినందుకు రోహిత్ నీకు థాంక్స్. రోహిత్​తో నా బంధం ప్రత్యేకమైంది. టీమ్ఇండియాలో ప్రతి ప్లేయర్​తో కలిసి పని చేయడం నాకు గౌరవం. రోహిత్​ నేను ఎంతో మాట్లాడుకున్నాం. చాలా వరకు మా అభిప్రాయాలు కలిశాయి. ఒక్కోసారి కలవలేదు. వరల్డ్​కప్​ అనుభూతులు జట్టులోని అందరూ గుర్తుంచుకుంటారు. మీ పోరాటానికి గర్విస్తున్నా. ఈ విజయం మీ కుటుంబ సభ్యులది కూడా. నా పట్ల మీరు చూపిన గౌరవం, ప్రేమాభిమానులకు కృతజ్ఞుడిని' అని రాహుల్ అన్నాడు.

Last Updated : Jul 3, 2024, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.