Prof Kodandaram on SC Reservations : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ చట్టాన్ని చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎఫ్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గీకరణ సాధనకై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మంగపల్లి శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం చట్టం చేయాలి : ప్రొఫెసర్ కోదండరాం
Prof Kodandaram On SC Reservations (ETV Bharat)
Published : Jul 7, 2024, 6:05 PM IST
ఈ చట్టం వల్ల రాష్ట్రంలో వర్గీకరణకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని తీసుకురావడం కోసం మాదిగ సమాజాన్ని ఎమ్మార్పీఎస్ ఏకతాటిపై తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ దీక్షా శిబిరానికి రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క తదితరులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. వర్గీకరణ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.